విజయవాడ:: ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నెలలో వేల సంఖ్యలో సంతకాలు సేకరించిన జేఏసీ.. ఇప్పుడు తమ పోరుబాటను మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కార్యచరణ రూపొందిస్తున్న ఆర్టీసీ జేఏసీ.. తమ భవిష్యత్ ఉద్యమాలకు కార్మిక సంఘాల మద్దతు కోరుతుంది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు.
ఏపీజేఏసీ అమరావతి, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ నేతలను కలిసి వారి మద్దతు కోరారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇస్తామని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు, ఎల్లుండి( ఆగస్టు9, 10వ తేదీల్లో) ఇతర సంఘాల నేతలను కలిసి మద్దతు కోరనుంది ఆర్టీసీ జేఏసీ.


