breaking news
chintada
-
నా భర్త ఆ రోజు అక్కడ లేడు... జగన్ శ్రీకాకుళం పర్యటనలో అక్రమ అరెస్ట్ లపై సంచలన నిజాలు
-
వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్‌ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీకాకుళం డిఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళ్తుండగా రోడ్డుపై ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు.చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, నా కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన ఈ రోజు సాగుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎక్కడికి తీసుకు వెళ్తున్నారో కనీసం చెప్పడం లేదు. ప్రతిరోజు పదిమంది పోలీసులు వచ్చి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు...హైకోర్టులో ఓ వైపు న్యాయ పోరాటం చేస్తున్నాం. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని డిఎస్పీ వద్ద లొంగిపోదామని వెళ్తున్నా.. మార్గ మధ్యలో నన్ను ఆపారు. ఎక్కడకి తీసుకువెళ్తున్నారో చెప్పడం లేదు. ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు.. బలవంతంగా కారు ఎక్కిస్తున్నారు’’ అంటూ చింతాడ రవికుమార్ మండిపడ్డారు. -
Chintada: రీల్స్ చేయడానికి మంత్రి అయ్యావా..? నీ సొంత జిల్లాకు ఏం చేశావ్..?
-
Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
-
చింతాడలో భగ్గుమన్న పాతకక్షలు
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చింతాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గ్రామ సర్పంచి రామచంద్రనాయుడు, మాజీ సర్పంచి కళావతి రెండు వర్గాలుగా విడిపోయారు. శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఆ దాడిలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌కు చేరి ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


