చింతాడలో భగ్గుమన్న పాతకక్షలు | Quarrelling between two rival groups in chintada | Sakshi
Sakshi News home page

చింతాడలో భగ్గుమన్న పాతకక్షలు

Jan 29 2016 10:54 AM | Updated on Sep 3 2017 4:34 PM

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చింతాడ గ్రామంలో రెండు వర్గాల మధ్య పాతకక్షలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చింతాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గ్రామ సర్పంచి రామచంద్రనాయుడు, మాజీ సర్పంచి కళావతి రెండు వర్గాలుగా విడిపోయారు.

శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఆ దాడిలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు చేరి ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టింది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement