● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
ఎన్ని ధనుంజయరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనతేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఎయిర్‌పోర్టు తామే నిర్మించామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 87 శాతం పనులు పూర్తయ్యాయని సాక్షాత్తు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కావాలనే పట్టుదలతో మౌలిక వసతులు, రన్ వే, టెర్మినల్ పనులను రికార్డు స్థాయిలో శంకుస్థాపన చేసిన రెండేళ్లలోనే 87 శాతం పనులు పూర్తిచేశారన్నారు. సమగ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే విజన్‌తో ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించింది జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్కొన్నారు. దీనిపై కూటమి నాయకులు ఎన్ని డ్రామాలాడినా వాస్తవాలు ఎంటనేది ప్రజలకు తెలుసు అన్నారు.


