అందని కిట్లు.. తప్పని పాట్లు | - | Sakshi
Sakshi News home page

అందని కిట్లు.. తప్పని పాట్లు

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

అందని కిట్లు.. తప్పని పాట్లు ● ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు మొండి చేయి ● జాడ లేని బెల్టులు ● హ్యాండ్‌ బుక్స్‌ అందక టీచర్ల అవస్థలు

రేషన్‌ బియ్యంతోనే భోజనాలు

● ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు మొండి చేయి ● జాడ లేని బెల్టులు ● హ్యాండ్‌ బుక్స్‌ అందక టీచర్ల అవస్థలు

శ్రీకాకుళం:

రుబుజ్జిలి మండలం కాగితాపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి, మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు. బెల్టులు సైతం విద్యార్థులకు ఇవ్వలేదు. విద్యార్థినులకు వేర్వేరు రంగులతో కూడిన నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేశారు

●గార మండలం శ్రీకూర్మంలోని జిల్లా పరిషత్‌ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లోని పలువురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఇక్కడి బాలికల ఉన్నత పాఠశాలలో టైప్‌–4 వసతి గృహం ఈ ఏడాది ప్రారంభం కావడంతో చాలా మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి వచ్చి ఈ హాస్టల్లో చేరా రు. వీరికి ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు గానీ యూని ఫాంలు గానీ బ్యాగులు కానీ ఇవ్వలేదు

●శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలుర పాఠశా ల ప్రధానోపాధ్యాయులుగా శ్రీకాకుళం ఉప విద్యా శాఖ అధికారి ఉండగా.. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా శ్రీకాకుళం ఎంఈఓ వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పాఠశాలల్లో కూడా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చిన బూట్లు వారికి సరిపడిన సైజులో లేకపోవడంతో నడవడానికి కూడా వీలు కావడం లేదు.

●విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా పిల్లలకు అందాల్సిన కిట్లు ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 1,53,867 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రైవేటు బ డుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారిన వారు సైతం ఉన్నారు. కానీ వీరికి పూర్తిస్థాయిలో ప్రభు త్వం కిట్లు ఇవ్వలేదు. విద్యాశాఖ క్యాలెండర్‌ ప్రకా రం ఆగస్టు మూడో తేదీ నుంచి సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులకే కాకుండా బోధనకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, వర్క్‌ బుక్‌లను కూ డా ఇవ్వలేదు. పుస్తకాలతో పాటు యూనిఫారాలు రంగులు మార్చి సరఫరా చేయడం కనిపించింది. బెల్టులు 25 శాతం మందికి మాత్రమే ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా.. అది మూన్నాళ్ల ముచ్చట అయ్యింది. ప్రస్తుతం రేషన్‌ బియ్యంతో విద్యార్థులకు అన్నాన్ని వడ్డిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సన్న బియ్యం సరఫరా కాలేదని, అవి వచ్చేవరకు రేషన్‌ బియ్యాన్ని సర్దుబాటు చేస్తున్నామని జిల్లా అధికారులు చెబుతుండడం విచారకరం. డొక్కా సీతమ్మ పేరు పెట్టి.. మధ్యాహ్నభోజనాన్ని అధ్వానంగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement