నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మహిళా రోగులు వినియోగించే మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళల వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఇటీవల ఆస్పత్రిలో హెచ్‌డీఎఫ్ ఫండ్స్ రూ. 50 లక్షలకు పైగా వెచ్చించి డాక్టర్ల రూమ్‌లకు ఏసీలు, ఆస్పత్రి సిబ్బంది గదులకు అదనంగా గాజు డోర్లు వేయించారు. ఇవన్నీ చేసి మరుగుదొడ్లకు తలుపులు బిగించడం మర్చిపోయారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– నరసన్నపేట


