మన యుద్ధం మొదలైంది | - | Sakshi
Sakshi News home page

మన యుద్ధం మొదలైంది

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

సమష్టి కృషితో వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

జిల్లాకు చంద్రబాబు ఏమైనా చేశారా..?

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, గత మూడు రాష్ట్ర బడ్జెట్‌లలో శ్రీకాకుళం జిల్లా కు సంబంధించి ఒక్క పైసా కూడా తీసుకు వచ్చిన దాఖలాలు లేవని ధర్మాన దుమ్మెత్తిపోశారు. ఆల్‌ ఇండియా అధికారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి వారిని తప్పుతోవ పట్టించడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సాటిరారన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్మాణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఏంటో ప్రజల కు వివరించాలన్నారు. చంద్రబాబునాయుడు తన పదవీ కాలంలో శ్రీకాకుళం జిల్లాకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు గానీ, అభివృద్ధి పనులు ఏమైనా తీసుకొచ్చారా అంటూ ధర్మాన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రతి సమావేశాలు, సభల్లోనూ ప్రకటనలను జారీ చేయడమే తప్ప వాటికి కార్యాచరణ చూపడం లేదన్నారు.

శ్రీకాకుళం రూరల్‌: సమష్టి కృషితో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేశామని మాజీ మంత్రి సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదపాడులోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన మా ట్లాడారు. తెలుగుదేశం పార్టీపై యుద్ధం మొదలుపెట్టామని, మరో మూడేళ్లు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. పార్టీ సమావేశాల్లోనూ, కార్యక్ర మాల్లోనూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ దొంగల పార్టీ అని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. పార్టీలో పదవులు పొందిన వారు కష్టపడి పనిచేయాలని, అలా చేయకుండా ఉండిపోతే ఆ పదవులు వేరొకరికి అప్పగించాలని నాయ కులకు సూచించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై స్పందించిన నాయకులు, మత్స్యకారులను ఏకతాటిపై తెచ్చిన వారిని అభినందించారు. అధికార పార్టీ చేసిన తప్పులను ప్రశ్నిస్తే పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైలులో పెట్టడం సర్కారుకు అలవాటుగా మారిందని, మార్పు ఇక్కడి నుంచే మొదలవుతోందన్నారు. ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవిపై లేనిపోని తప్పులను మోపుతూ క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం చాలా అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వం దమనకాండ నశించాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ, గ్రామ స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి జనార్ధనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, చల్లా రవికుమార్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ పట్నాయక్‌, గొండు రఘరామ్‌, ముంజేటి కృష్ణమూర్తి, గొండు కృష్ణమూర్తి, పీస గోపి, మూకళ్ల తాతబాబు, మండవల్లి రవి, సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, పొన్నాడ రుషి, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement