● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే
● విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే చెల్లించాలి
● ఇచ్ఛాపురంలో డీఎస్సీ అక్రమాలపై చర్చా వేదిక
ఇచ్ఛాపురం: డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని బస్టాండ్ కూడలి సమీపంలోని గల టౌన్‌హాల్‌లో ఆయన ఆధ్వర్యంలో సోమవారం యువత, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ విభాగాల ప్రతినిధులతో డీఎస్సీ అక్రమా లపై చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సమన్వయకర్త మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో డీఎస్సీ కన్వీనర్‌ని పక్కన పెట్టి ప్రశ్న పత్రాల తయారీ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, స్పోర్ట్స్ కోటా నియమనిబంధనలు మార్చడం చేశారని తెలిపారు. వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక్కో పోస్టుని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెప్పినట్లు నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారని, తాము కూడా ఇకపై ఎమ్మెల్యేను ఏకవచనంతోనే పిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురా లు ఉలాల భారతిదివ్య, ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పా డ నారాయణమ్మ పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కడియాల ప్రకాష్, నర్తు ప్రేమ్‌కుమార్, తడక జోగారావు, సల్లాదేవరాజు, నర్తు ప్రసాద్, ఆశిపురుషోత్తంరెడ్డి, సారధి, వివేకానంద్, సాలిన గాంధీ, సీతయ్య, ఎండీ షఫీ, కిరణ్‌బెహర, త్రినాథ్, సాడి జయరామ్, అభి తదితరులు పాల్గొన్నారు.


