ఆంక్షలను జయించిన అభిమానం | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలను జయించిన అభిమానం

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

125 కిలోమీటర్ల ప్రయాణ దూరం.. సుమారు ఆరున్నర గంటల సమయం..

మామూలుగా అయితే కారు లాంటి వాహనంలో వెళ్తే రెండున్నర నుంచి మూడు గంటల్లో చేరుకోవచ్చు. అదే ప్రముఖుల కాన్వాయ్‌లైతే మరింత తొందరగా చేరుకోవచ్చు. కానీ అపారమైన జనాభిమానం కలిగిన నాయకుడు. అడుగడుగునా అభిమాన తరంగాలు ఎగిసిపడుతూ ఆటోమేటిగ్గా బ్రేకులు వేస్తుంటే ప్రయాణంలో ఆలస్యం అనివార్యం అవుతుంది. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గురువారం ఇదే అనుభవం ఎదురైంది. ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకున్న ఆయన అక్కడినుంచి సింహాచలం, అడవివరం మీదుగా జాతీయ రహదారిపై గార మండలంలోని అంపోలు జైలు ఆవరణకు చేరడానికి అక్షరాలా ఆరున్నర గంటలు సమయం పట్టింది. దారిపొడవునా ప్రతి పల్లె, ప్రతి జంక్షన్‌ వద్ద పార్టీ శ్రేణులు, అంతకుమించి ప్రజలు అభిమాన నేత కోసం గంటలతరబడి నిరీక్షించారు. కాన్వాయ్‌కి అడ్డుపడి వైఎస్‌ జగన్‌ కరస్పర్శ కోసం పోటీ పడ్డారు. ఫలితంగా కాన్వాయ్‌ స్పీడుకి అభిమాన బ్రేకులు పడ్డాయి. ప్రయాణం నెమ్మదిగా సాగి.. ఆలస్యం అనివార్యమైంది. అయితే వైఎస్‌ జగన్‌ను జనం కలవకుండా పోలీసులు భారీగా మోహరించినా.. ఆంక్షలు విధించినా.. అభిమానం వాటన్నింటినీ జయించింది. అభిమాన నేతను అక్కున చేర్చుకుంది. చెట్లు, తుప్పలు, పొలాలకు అడ్డంపడి పరుగులు తీసి మరీ వేలాది ప్రజలు జగన్‌ కాన్వాయ్‌ను అనుసరించారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/అరసవల్లి:

క్రమ కేసులో అరైస్టె జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దారి పొడవునా కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం లభించింది. ములాఖత్‌కు జైలు వద్దకు వెళ్లిన వైఎస్‌ జగన్‌ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని, అతని కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.

అంతకుముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రావడంతో దారి పొడవునా ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. జగన్‌ కోసం తరలివచ్చిన జన సునామీ కారణంగా ఎక్కడికక్కడే పర్యటన ఆలస్యమైంది. రణస్థలం, చిలకపాలెం, నవభారత్‌ జంక్షన్‌, కొత్త రోడ్డు కూడలి, పెద్దపాడు కూడలి, అంపోలు జంక్షన్‌ మీదుగా జిల్లా జైలుకు తరలివెళ్లారు. మహిళలు, యువత అధికంగా కనిపించగా.. మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో కనిపించడం గమనార్హం. మరో వైపు పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. కేసులు పెడతామని కూడా బెదిరించారు. అయినా వెరవకుండా అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎవరినీ నిరాశ పరచకుండా వైఎస్‌ జగన్‌ అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు అందుకుంటూ ముందుకు కదిలారు. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్‌ వర్మ, అర్నవ్‌ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులను ఎండగట్టారు. ప్రతిపక్ష నాయకులపై చేస్తున్న కుట్రలను సోదాహరణంగా వివరించారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి ములాఖత్‌లో కలిసేందుకు వచ్చిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సీదిరి శ్రీదేవి, ఆయన తనయుడు ఆరవ్‌ వర్మ, అర్నవ్‌ వర్మలతో పాటు బొత్స సత్యనారాయణ, రీజనల్‌ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌, పసుపులేటి బాలరాజు, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, నర్తు రామారావు, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్‌, పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఎంవీ పద్మావతి, పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ హర్షవర్ధన్‌రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, నియోజకవర్గ సమన్వయ కర్తలు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్‌, రాష్ట్రకార్యదర్శులు కేవీజీ సత్యనారాయణ, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధ నుంజయరావు, బొడ్డేపల్లి పద్మజ, చల్ల రవికుమార్‌, ఎస్‌ఈసి మెంబర్‌ గొండు కృష్ణమూర్తి, యువనేతలు ధర్మానరామ్‌మనోహర్‌నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, కేకే రాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీ దివ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, గొండు రఘురాం, పీస గోపి, తంగుడు జోగారావు, పేడాడ రమణి, మత్య్సకార న్యాయవాది మూగి గురుమూర్తిలతోపాటు అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement