కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... | - | Sakshi
Sakshi News home page

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...

హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ వల్ల తన కుమారుడికు తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదని అధికారులు చెబుతున్నారని శ్రీకాకుళం నగరం బలగకు చెందిన గేదెల నాగమణి తెలిపారు. రెండేళ్లుగా అన్ని కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా, మ్యాపింగ్‌ సమస్య పరిష్కరం జరగలేదని వాపోయారు. తమ కుటుంబంలో వాళ్ల మరిది కుటుంబం చేరి ఉన్నందున ఈ పథకం వర్తించడం లేదని అధికారులు చెబుతున్నారన్నారు. హౌ హోల్డ్‌ మ్యాపింగ్‌ సరిచేయాలని సచివాలయం, మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం, వాళ్ల మరిది కుటుంబానికి రేషన్‌ కార్డులు వేర్వేరుగా ఉన్నప్పటికీ హౌస్‌ హోల్డ్‌లో విడదీయలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ కారణం వలన దివ్యాంగుడైన తన భర్తకు పింఛన్‌ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement