సీదిరి విడుదల కావాలంటూ గంగమ్మ తల్లికి పూజలు | - | Sakshi
Sakshi News home page

సీదిరి విడుదల కావాలంటూ గంగమ్మ తల్లికి పూజలు

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

వజ్రపుకొత్తూరు: మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు జైలు నుంచి బెయిల్‌పై త్వరగా విడుదల కావాలంటూ దేవునల్తాడ తీరంలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు సౌదాల వెంకన్న ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు, సీనియర్‌ నాయకులు పుక్కళ్ల గురయ్యనాయుడు మహిళలతో కలిసి గంగమ్మ తల్లిని వేడుకున్నారు. డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామంటూ నినాదాలు చేశారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిని తాము కాపాడుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మత్స్యకార ఐక్య వేదిక నాయకులు అడ్వకేట్‌ కొమర దేవరాజు, అంబటి ఆనంద్‌, వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు దున్న బాలరాజు, వైస్‌ ఎంపీపీ వంక రాజు, యువజన విభాగం కార్యదర్శి కర్ని శ్రీను, చింత హేమారావు, గూడ భాస్కరరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement