● ఎమర్జెన్సీ డ్రగ్‌ కొరత | - | Sakshi
Sakshi News home page

● ఎమర్జెన్సీ డ్రగ్‌ కొరత

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

టెక్కలి రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ డ్రగ్‌ అందుబాటులో లేదని పలువురు వాపోతున్నారు. ఆయా సం, గుండె నొప్పి వంటి అత్యవసర కేసులకు ఇవ్వాల్సిన హైడ్రోకార్జిన్‌ అనే ఇంజెక్షన్‌ అందుబాటులో లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు వాటిని రోగి తాలు కా బంధువులు బయట కొనుగోలు చేసి వేయాల్సి న పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇదే విషయమై ఫార్మసి డిపార్ట్‌మెంట్‌ వారి వివరణ కోరగా ఆ డ్రగ్‌ ఎమర్జెన్సీ సమయంలో వాడుతారని తెలిపారు. అయితే ఆ డ్రగ్‌ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి సరఫరా లేకపోవడంతో వాటిని లోకల్‌ పర్చేజ్‌ చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఎమర్జెన్సీ డ్రగ్‌ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement