‘స్థానిక ఎన్నికల్లోపు సీపీఎస్‌ రద్దు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక ఎన్నికల్లోపు సీపీఎస్‌ రద్దు చేయాలి’

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

శ్రీకాకుళం అర్బన్‌, శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ భవనంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షులు చల్ల సింహాచలం అధ్యక్షతన ఆదివారం ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 1న గుంటూరులో నిర్వహించనున్న ‘సమర శంఖం’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సీపీఎస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా మని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేద ని విమర్శించారు. ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతే ప్రభుత్వాలే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని కరిమి రాజేశ్వరరావు హెచ్చరించారు. విశాఖపట్నం, కడప, అనంతపురంలో నిర్వహించిన ఉద్యమా లను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంటూ, సెప్టెంబర్‌ 1న ‘పెన్షన్‌ విద్రోహ దినం‘ సందర్భంగా గుంటూరులో జిల్లా కలెక్టరేట్‌ నుంచి భారీ ర్యాలీ, అనంతరం ‘సమర శంఖం‘ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement