‘ప్రాచీన కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రాచీన కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత’

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

మందస: మందస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో బౌద్ధ జైన మతానికి సంబంధించిన ప్రాచీన కట్టడాలను కాంట్రాక్టర్‌ ధ్వంసం చేసిన చోటనే పునర్నిర్మించాలని, అంతవరకూ పరిరక్షణ కమిటీ సాగిస్తున్న దశల వారీ పోరాటం ఆగదని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. మందసలోని ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మందస ప్రభుత్వం జూనియర్‌ కళాశాల సమీ పంలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కమిటీ కన్వీనర్‌ మామిడి కోదండరావు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో సుమారు 100 మంది ఆహ్వానిత ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రాచీ న కట్టడాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని గుర్తు చేశారు. ప్రాచీన కట్టడాల విధ్వంసానికి పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలను తీసుకోవాలన్నారు. కళింగ సీమ రాష్ట్ర సాధన సమితి నాయకులు డాక్టర్‌ జీవిశ్వరరావు మాట్లాడుతూ పాలకుల అండదండలతో విధ్వంసం సాగడ శోచనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement