శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

మేం రైతులం కాదాసర్కారు వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు అందడం లేదంటున్నారు. –8లో

న్యూస్‌రీల్‌

మేం రైతులం కాదాసర్కారు వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు అందడం లేదంటున్నారు. –8లో

అడుగడుగునా వైఫల్యాలు

అడిగితే వేధింపులు

సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026

‘10న జైలు భరోసా’

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం జయప్రదం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 9 క్విట్‌ ఇండియా దినమని,ఆగస్టు 10న కార్మికులు, రైతులు, సా మాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాలు నిర్ణయించాయని అన్నారు. సమావేశంలో సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ,ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్రరావు పోలాకి ప్రసాదరావు పాల్గొన్నారు.

జెమ్స్‌లో అవయవదానం

శ్రీకాకుళం రూరల్‌: గార మండలం సొండిపేట గ్రామానికి చెందిన శ్రీ సత్యసాయి మందిర కన్వీనర్‌ వెలమల సింహాచలం భార్య అరుణకుమారి అనారోగ్య కార ణంగా ఆదివారం మృతిచెందారు. ఈమెకు చెందిన అవయవాలను కిడ్నీ, లివర్‌, ఊపిరితిత్తులను జెమ్స్‌ ఆస్పత్రికి దానం చేశారు. ఈమెకు సాయిగీత, రేవతి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అంత విషాదంలోనే అవయవదానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను ప్రశంసించారు.

అతిథి అధ్యాపకులను

ఆదుకునేది ఎవరు?

శ్రీకాకుళం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని ఆదుకునే వారే లేకుండా పోయారు. వీరంతా పన్నెండేళ్లుగా సర్వీసులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇటీవ ల చేపట్టిన కొన్ని చర్యలు కారణంగా వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వంద మంది వరకు అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలు, జూనియర్‌ లెక్చరర్లకు పదోన్నతులు, ఒప్పంద అధ్యాపకులకు రెన్యువల్‌ చేసి న సందర్భంలో అతిథి అధ్యాపకులు రోడ్డున పడ్డారు. ఇంటర్మీడియెట్‌లో కూడా ఇలాంటివి జరిగినప్పటికీ అతిథి అధ్యాపకులను ఖాళీ ఉన్న కళాశాలలకు పంపించారు. ఉన్నత విద్యా శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా యోచన చేయడం లేదు. ఉన్నత విద్యావంతులైన అతిథి అధ్యాపకులు పలుసార్లు ప్రజాప్రతినిధులను మంత్రులను ఉన్నత విద్యాశాఖ అధికారులను కలసి తమ గోడు విన్నవించినా పట్టించుకునే వారే లేరు. వీరికి చెల్లిస్తున్న గౌరవ వేతనం కూడా చాలా తక్కువ. ఓ క్లాసును బోధిస్తే రూ.400 చెల్లిస్తారు. అయితే ఇది గరిష్టంగా రూ.28 వేలకు పరిమితం చేయడంతో నెలకు అంతకంటే ఎక్కువ జీతం పొందే అవకాశం లేకుండా పోయింది. నెలకు 70 క్లాసులకు మాత్రమే జీతం చెల్లిస్తూ ఉండడం వలన రూ.28లు మాత్రమే జీతంగా పొందుతున్నా రు. ఈ జీతంతోనే ఎలాగోలా నెట్టుకుని వస్తుంటే.. ఇప్పుడు ఏకంగా కొలువులే తీసేస్తుండడంతో వారంతా లబోదిబోమంటున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

చాప కింద నీరులా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభు త్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఎంచుకుంది. ప్రభుత్వ వైఫల్యం కనిపించిన ప్రతిసారీ విపక్ష నేతలపై వేధింపులు మొదలుపెడుతూ తన తప్పిదాలను దాచుకుంటోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు.. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తే ప్రభుత్వ లోపాలన్నీ జనం కళ్లకు కనిపించకుండా పోతాయని అనుకుంటోంది. అందులో భాగంగానే మొన్న సీదిరి అప్పలరాజు తాజాగా చింతాడ రవికుమార్‌పై కక్ష సాధింపులకు దిగింది.

సీదిరి అప్పలరాజు ప్రజల తరఫున ప్రభుత్వా న్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన కొడు కు యాక్సిడెంట్‌ను రాజకీయం చేసి ఆ గొంతును అణచాలని చూశారు. తాజాగా వైఎస్‌ జగన్‌ సీదిరిని కలవడానికి జిల్లాకు వచ్చారు. విశాఖ నుంచి శ్రీకాకు ళం వరకు జనం ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. ఇది సర్కారుకు కంటగింపుగా మారింది. ఎలాగైనా ఈ హడావుడిని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై కేసులు బనాయించింది. దీని కోసం ఓ మహిళా ఎస్‌ఐను పావుగా ఉపయోగించుకోవడం విస్తు గొలుపుతోంది. మహిళా ఎస్‌ఐను ఈ జనం నుంచి పక్కకు సురక్షితంగా వెళ్లాలని సూచించిన వీడియోను చిలువలు పలువ లు చేసి నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టింది.

కుట్రలు భగ్నం

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన ఒక్క విషయా న్ని తేటతెల్లం చేసింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఆంక్షలు విధించినా జనం నుంచి జగన్‌ను విడదీయలేరని స్పష్టం చేసింది. జగన్‌ అడుగు పెట్టగానే ఉత్తరాంధ్ర జనసంద్రంగా మారింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు సాగిన వైఎస్‌ జగన్‌ ప్రయాణంలో జన ప్రవాహంతో రహదారులు నిండిపోయాయి. జనమంతా జగన్‌ వెంటే సాగారు. ఈ పర్యటన ప్రభుత్వానికి గుబులు పుట్టించింది. దీన్ని పక్కదారి పట్టించాలని మహిళా ఎస్‌ఐ ఉదంతాన్ని వాడుకుంది. ఆమదాలవలస సమన్వయకర్త చింతా డ రవికుమార్‌ యాక్టివ్‌గా ఉన్నారు. ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తీరుపై గట్టిగా ప్రశ్నించడంతో పాటు నిలదీస్తున్నారు. ఇటీవల కాలంలో మిర్తిబట్టి భూ ఆక్రమణలపై కూన రవికుమార్‌కు సవాల్‌ విసిరారు. ఆయన చేస్తున్న అక్ర మ దందాను ఆధారాలతో చూపిస్తానని, చర్చకు రావాలని కోరారు. దీంతో కూనపై అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం కావడం, అపూర్వ ఆదరణ లభించడంతో మహిళా ఎస్‌ఐ ఉదంతాన్ని తీసుకుని రాజకీ యం చేసి, కక్ష సాధింపునకు దిగారు.

అక్షర దోషం..

చిన్నారికి శాపం

పోలాకి: ఆక్వా రైతులకు అదనపు కష్టాలు ముంచుకువస్తున్నాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా వనామీ రకం రొయ్యలకు వైట్‌స్పాట్‌ వ్యాధి సోకి నెలరోజుల వయసులోనే రొయ్యపిల్లలు చనిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు పెరిగి ఉప్పుదనంలో మార్పులు ఏర్పడి వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోందని ఆక్వా టెక్నీషియన్స్‌ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యలు ఒత్తిడికి గురై వ్యా ధి నిరోధక శక్తిని కోల్పోతున్నాయి. దీంతో వైట్‌ స్పాట్‌ సిండ్రోమ్‌ వైరస్‌(డబ్ల్యూఎస్‌ఎస్‌వి) వేగంగా ప్రబలేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అటు ఫీడ్‌ ధరలు పెరిగి, రొయ్యల కొనుగోలు ధరలతో పాటు, విద్యుత్‌ రాయితీలు తగ్గటంతో ఆక్వారైతులకు తెల్లమచ్చ వ్యాధి అదనపు కష్టంగా త యారైంది. జిల్లాలో సుమారుగా 4200 ఎకరాల్లో సుమారుగా 400 మంది ఆక్వాసాగు చేస్తున్నారు.

విపక్ష నేతలపై సాగుతున్న వేధింపుల పర్వం

అక్రమ కేసుల్లో అరెస్టు చేసి, జైలుకు పంపించడమే లక్ష్యం

మొన్న సీదిరి అప్పలరాజు, నేడు చింతాడ రవికుమార్‌

పోలీసులను పావుగా వాడుకుంటున్న అధికార పార్టీ

వైఎస్‌ జగన్‌ పర్యటనకు వచ్చిన ఆదరణ చూడలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌

మహిళా ఎస్‌ఐ ప్రవళ్లిక ఆత్మాభిమానం దెబ్బతినేలా టీడీపీ నేతల ప్రెస్‌మీట్లు

అసలు జరిగిందేమిటి.?

వైఎస్‌ జగన్‌ పర్యటనలో విపరీతమైన జనం రావడంతో ఆ క్రౌడ్‌ మధ్య మహిళా ఎస్‌ఐ ప్రవల్లిక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి, అప్పటికే ఆరోగ్య సమస్యతో ఉన్న ఎస్‌ఐ ప్రవల్లికను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నినాదాల హోరు ఎక్కువగా ఉండటంతో ఆ శబ్ధానికి ఆమె చెవులు మూసుకున్నారు. కానీ చెవు లు మూసుకున్న దృశ్యాలను చూపించి మహిళా ఎస్‌ఐపై అనుచితంగా వ్యవహరించారని కేసు పెట్టారు. వాస్తవంగా ఆ మహిళా ఎస్‌ఐ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది టీడీపీ నాయకులే. ప్రెస్‌మీట్‌లు పెట్టి అది జరిగింది, ఇది జరిగిందంటూ ఊరువాడా ప్రచారం చేశారు. వాస్తవానికి అదే మహిళా ఎస్‌ఐపై తోటి పోలీసు సిబ్బంది ఆ రద్దీలో ఇబ్బందికరంగా వ్యవహరించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement