‘సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి’

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

‘భోగాపురం వైభోగం వైఎస్‌ జగన్‌ సొంతం’ ముగిసిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌

శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 28 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్షులు చావలి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఓ ప్రకటనలో కోరారు. కేజీబీవీ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, క్లస్టర్‌ రిసోర్స్‌ మొబైల్‌ టీచర్లు, ఎం ఐఎస్‌ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్లు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ లు, మెసెంజర్లు, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు, వీరంతా విద్యా వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రెండు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.

వీఆర్‌ఓల అడ్‌హక్‌ కమిటీ ఎన్నిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వీఆర్‌ఓల శ్రీకాకుళం డివిజన్‌ అడహక్‌ అధ్యక్షుడిగా టి.లక్ష్మణరావు ఎన్నికయ్యారు. ఆంధ్రపదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్‌ కుమార్‌ అధ్యక్షతన శ్రీకాకుళం డివిజన్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సమావేశం పట్టణంలోని రెవెన్యూ అతిథి గృహంలో జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌ అడహక్‌ కమిటీని ఎన్నుకు న్నారు. అడహక్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా బి.సునీల్‌ కుమార్‌, బి.శంకర్‌, పి.జ్యోతి, జనరల్‌ సెక్రటరీగా జి.వేణుగోపాల్‌ రెడ్డి, ట్రెజరర్‌గా ఆర్‌.భరత్‌, జాయింట్‌ సెక్రెటరీలుగా ఎం.గోవింద రావు, పి.శ్రీనివాస రావు, పి.రాజేశ్వరి ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా వై.ఈశ్వర రావు, కె.శ్రీనివాసరావు, కె.ధనలక్ష్మి, పి.రవి కుమార్‌ ఎన్నికయ్యారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భోగాపురం ఎయిర్‌పోర్టు వైభవానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషే కారణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంటరీ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ఆయా ప్రాంత రైతుల్ని సంతృప్తిపరిచాకే పోర్టు నిర్మాణం చేపడితే సక్సెస్‌గా పూర్తవుతుందని నమ్మిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌, భూసేకరణకు డబ్బులిచ్చింది వైఎస్‌ జగనేనని తెలిపారు. అన్ని పను లు పూర్తి చేశాక టీడీపీ నాయకులు తామే పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నా రు. వైఎస్సార్‌సీపీ హయాంలో 86.6శాతం పనులు పూర్తిచేశామని, మిగిలి ఉన్న 13.4 శాతం పనులు చేయడానికి రెండున్నరేళ్ల సమయం పట్టిందన్నారు.

రమణమ్మ నేత్రాలు సజీవం

శ్రీకాకుళం కల్చరల్‌: పట్టణంలోని పీఎన్‌ కాలనీకి చెందిన మండా రమణమ్మ(88) మృతి చెందగా, ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మగటపల్లి కల్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, నంది ఉమశంకర్‌ ద్వారా మృతదేహం నుంచి కార్నియాలను సేకరించారు. వాటిని విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె. దుర్గా శ్రీనివాస్‌తో పాటు ఇతర సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు పి .సుజాత 78426 99321, నంది ఉమా శంకర్‌ 9701698408 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: స్వర్గీయ కొన్న చిన్నారావు అథ్లెటిక్స్‌ మీట్‌ కన్నులపండువలా సాగింది. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సహకారంతో కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు వా సు, మధు వారి మితృబృందం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం జరగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కమ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా నలు మూలల నుంచి సుమారు 600 మంది వరకు హాజరైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అండర్‌–14, 16, 18, 20 వయో విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు ప్రజాప్రతినిధులు, కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు, అధికారులు, అతిథుల చేతులమీదుగా పతకాలు, ప్రసంశాపత్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement