శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

ఏమైందో.. ఏమోదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త చనిపోగా భార్య బతికారు. –8లో ● ఇదీ టూర్‌ షెడ్యూల్‌

న్యూస్‌రీల్‌

ఏమైందో.. ఏమోదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త చనిపోగా భార్య బతికారు. –8లో
జిల్లాకు వైఎస్‌ జగన్‌ రాక రేపు

సబ్‌జైల్‌లో ఉన్న సీదిరి అప్పలరాజును

పరామర్శించనున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

7

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026

శ్రీకాకుళం రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. పెదపాడులోని ధర్మాన నివాసంలో మంగళవారం పార్టీ సమన్వయకర్తలతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి శ్రీకాకుళంలో గల సబ్‌జైల్‌కు తరలించిన నేపథ్యంలో సీదిరిని ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ కలవనున్నట్లు తెలిపా రు. మత్స్యకార వర్గంపై వైఎస్‌ జగన్‌కు అవ్యాజమైన అభిమానం ఉందని, పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను స్వదేశానికి రప్పించి వారికి ధైర్యం, భరోసా కల్పించారని గుర్తు చేశారు. జిల్లాలోని మత్స్యకారులకు శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సుమారు రూ.300 కోట్లు వ్యయంతో బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. చంద్రబాబు మాత్రం కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ.. విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుని అంపోలు జైలులో ములాఖత్‌లో కలవనున్నట్లు పోలీస్‌ అధికారిక వర్గాలు తెలిపాయి. వారు తెలిపిన షెడ్యూల్‌ ప్రకారం.

30వ తేదీ ఉదయం 9గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి బయలుదేరుతారు.

9.30గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9.45 గంటలకు వియానంలో బయలుదేరి 10.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు.

11గంటలకు రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అంపోలులోని శ్రీకాకుళం జిల్లా జైలుకి చేరుకుంటారు. 2 నుంచి 3గంటల వరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌ అవ్వనున్నారు. 3 గంటలకు జిల్లా జైలు వద్ద నుంచి బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement