శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని సరస్వతి థియేటర్‌లో శుక్రవారం ‘చైన్నె లవ్‌స్టోరీ చిత్ర యూనిట్’ సందడి చేసింది. చైన్నె లవ్‌స్టోరీ చిత్రం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీ ప్రియ, దర్శకుడు రవి నంబూరిలతో కూడిన ఈ చిత్ర యూనిట్ సరస్వతి థియేటర్‌కు చేరుకుని ప్రేక్షకులతో మమేకమయ్యారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో ఇంతటి ఘన విజయం చేసిన ప్రే క్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ తాను సిక్కోలు రావడం ఇదే మొదటిసారి అని, మీ ఆదరాభిమానాలు మరువలేనని అన్నారు.


