న్యూస్‌రీల్
జిల్లాలో మొత్తం ఓటర్లు
● పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
● ఆగస్టు 30 వరకు కై ్లములు, అభ్యంతరాల స్వీకరణ
● ముసాయిదా విడుదల
ఆకట్టుకున్న ఎయిర్‌పోర్టు లోగో
వజ్రపుకొత్తూరు రూరల్: భోగాపురం ఎయిర్‌పోర్టు లోగోను పలాస గాంధీనగర్‌కు చెందిన స్వర్ణ కళాకారుడు కొత్తపల్లి రమేష్ తయారు చేశారు. బంగారం రేకుపై 1.5 సెంటిమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో 80 మిల్లీగ్రాములు బంగారం వినియోగించారు.
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026
17,24,896
శ్రీకాకుళం పాతబస్టాండ్:
‘సర్’ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా ముసాయిదాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా జూలై 31 నాటికి సిద్ధం చేసిన ముసా యిదా జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసా యిదా ఓటర్ల జాబితా ప్రతులను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,24,896 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుష ఓటర్లు 8,54,771 మంది కాగా, మహిళా ఓటర్లు 8,70,051 మంది, ఇతరులు 74 మంది ఉన్నారని స్పష్టం చేశారు.
సర్వీస్ ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా 15,983 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా పురుషులు 15,386, మహిళలు 597 మంది ఉన్నారు. 59 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు (పురుషులు: 51, మహిళలు: 8) ఉన్నారు. ఇచ్ఛాపురంలో 1,955, పలాసలో 2,945, టెక్కలిలో 2,830, పాతపట్నంలో 1,772, శ్రీకాకుళంలో 1,231, ఆమదాలవలసలో 2,184, ఎచ్చెర్లలో 918, నరసన్నపేటలో 2,148 మంది సర్వీస్ ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లలో ఇచ్ఛాపురంలో 10, పలాసలో 1, టెక్కలిలో 11, పాతపట్నంలో 5, శ్రీకాకుళంలో 23, ఆముదాలవలసలో 3, ఎచ్చెర్లలో 4, నరసన్నపేటలో 2 మంది ఉన్నారు.
ఓటు వివరాలు పరిశీలించుకోవాలి
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతి ఓటరు తమ పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. పేరు నమోదు కాకపోయినా లేదా ఏవైనా తప్పులు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్లు ఉంటే సంబంధిత ఈఆర్‌ఓ లేదా ఏఈఆర్‌ఓ కార్యాలయాలను సంప్రదించి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫారం–6, ఫారం–7 లేదా ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.
నియోజకవర్గాల వారీగా..
శ్రీకాకుళం నియోజకవర్గం 2,51,218 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలవగా, ఆమదాలవలస 1,77,870 మందితో చివరి స్థానంలో ఉంది. నియోజకవర్గాల వారీగా వివరాలు చూస్తే..
నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు
శ్రీకాకుళం 2,51,218 1,23,861 1,27,336 21
ఇచ్ఛాపురం 2,41,599 1,17,372 1,24,211 16
ఎచ్చెర్ల 2,26,142 1,13,869 1,12,261 12
టెక్కలి 2,17,824 1,08,689 1,09,129 6
పాతపట్నం 2,08,607 1,03,980 1,04,620 7
పలాస 2,01,828 98,523 1,03,297 8
నరసన్నపేట 1,99,808 99,820 99,985 3
ఆమదాలవలస 1,77,870 88,657 89,212 1


