గిరిజన విద్యార్థిని బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థిని బలవన్మరణం

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

● కొత్తూరు కేజీబీవీ టైప్‌–4 వసతి గృహంలో ఘటన

● తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్న కుటుంబ సభ్యులు

● హాస్టల్‌లో జాయినైన రెండు వారాలకే అఘాయిత్యం

● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కొత్తూరు: స్థానిక కేజీబీవీ టైప్‌–4 వసతి గృహంలో గురువారం రాత్రి సవర పూజ (16) అనే ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దేవనాపురం గిరిజన పంచాయతీ పరిధి లక్కయ్యగూడ గిరిజన గ్రామానికి చెందిన సవర బిడ్డికయ్య, తుప్పమ్మ దంపతుల మూడో కుమార్తె అయిన పూజ కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజి లో మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ నెల 16నే హాస్టల్‌లో చేరింది. శుక్రవారం వేకువజామున స్టడీ అవర్స్‌ కోసం విద్యార్థులను నైట్‌ టీచర్‌ నిద్ర లేపుతుండగా పక్క గదిలో పూజ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆమె మెట్రిన్‌ క్రాంతికి, హెచ్‌ఎం ఎ.గోవిందరావు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు విషయం తెలియడంతో ఎస్‌ఐ కె.వెంకటేష్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. వివరాలు సేకరించి తండ్రి బిడ్డికయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

ఈ నెల 28న బిడ్డికయ్య హాస్టల్‌కు వచ్చి విద్యార్థినికి ఖర్చుల కోసం రూ.900 ఇచ్చారు. ఆ సందర్భంలో పూజ తనకు ఇంగ్లిష్‌ చదువులు అర్థం కావడం లేదని, హాస్టల్‌ నచ్చడం లేదని చెప్పింది. కానీ తండ్రి ఆమెకు నచ్చజెప్పి వచ్చేశారు. ఇప్పు డు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తమ బిడ్డ అంత పిరికిది కాదని కుటుంబ సభ్యు లు అంటున్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాల ని కోరుతున్నారు. గురువారం రాత్రి 9.30, అర్ధరాత్రి 12 గంటలు వరకు ఇద్దరు విద్యార్థినుల బర్త్‌డే జరుపుకున్నారని, పూజ అంతవరకు ఉందని అక్క డి వారు చెప్పారు. పూజ విజయనగరం జిల్లా రాజాంలో ఇదివరకు చదివింది. అక్కడ నీరు వల్ల దురదలు రావడంతో తండ్రి కొత్తూరులో జాయిన్‌ చేశారు. అయితే సంఘటన స్థలం వద్ద ఓ లేఖ దొరి కినట్లు సమాచారం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు దహ న ఖర్చులను అలాగే హెచ్‌ఎం గోవిందరావు మరో రూ.ఐదు వేలును అందజేశారు.

హాస్టల్‌ ఖాళీ

విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులంతా భయపడ్డారు. దాదాపు 90 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో హాస్టల్‌ ఖాళీ అయిపోయింది. టెక్కలి డిప్యూటీ డీఈఓ పి. విలయమ్‌, సర్వ శిక్ష అభియాన్‌కు చెందిన జీసీడీపీఓలు సందర్శించి విద్యార్థి మృతి పై వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పంపించామని హెచ్‌ఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement