డీఎస్సీ సర్వం.. అక్రమాల పర్వం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ సర్వం.. అక్రమాల పర్వం

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

● అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి

● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

● జేసీకి వినతి పత్రం సమర్పించిన

వైఎస్సార్‌ సీపీ నాయకులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన వారిపై దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు, యువకులు శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రంను అందజేశారు. స్పోర్ట్స్‌ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ, సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక చేశారని, అందుకోసం ప్రత్యేకంగా జీఓలు జారీ చేశారని తెలిపారు. కనీస విద్యార్హ తల టెట్‌ అర్హత సాధించకున్నా కేవలం కొన్ని సర్టి ఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారని వారు జేసీకి వివరించారు. అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు అన్నీ ఉన్నా ప్రభుత్వం తనకు తానే క్లీన్‌ చిట్‌ ఇచ్చుకోవడం దారుణమని తెలిపారు. జేసీని కలిసిన వారి లో వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌, యువ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, మార్పు పృథ్వీ, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ, మామిడి శ్రీకాంత్‌, అంధవరపు సూరిబాబు, చల్లా రవికు మార్‌, పిన్నింటి సాయి, గేదెల పురుషోత్తం, దుంపల రామారావు, రౌతు శంకరరావు ఉన్నారు.

అక్రమాల పర్వం

● ప్రశ్న పత్రాల తయారీ ఔట్‌ సోర్సింగ్‌కు అప్పగించి లీకేజీకి పునాది వేశారని ఆరోపించారు.

● ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి టాపర్‌గా నిలవడమే అక్రమాలకు నిదర్శనమని తెలిపారు.

● స్పోర్ట్స్‌ కోటాలో చాలాసార్లు జీఓలు, నిబంధనలను మార్చారని, మొదట ఇచ్చిన జీఓలు సరైనవే అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దు చేస్తూ జీఓలు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.

● క్రీడా సంఘాలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికు మార్‌ అని, జూడో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షు డు లోకేష్‌ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్‌ అని, జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్‌ నుంచి 38 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారని వివరించారు.

● కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు ఇవ్వడం లేదన్నారు.

● నిరుద్యోగ భృతి మాటే మరిచారని విమర్శించారు.

విద్యార్థులతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు

డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి వంటివి విద్యార్థులకు కీలకం. అందులో మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. విద్యార్థి ఉద్యమాలతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై యువత తిరగబడాలి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. దీనికి బాధ్యత వహి స్తూవిద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయా లి. డీఎస్సీ స్కామ్‌, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి సాధనకు 20 రోజులు ఉద్యమాలు చేస్తాం. – పేరాడ తిలక్‌,

వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement