అరకొర నిధులతో ఆటలు ఎలా..? | - | Sakshi
Sakshi News home page

అరకొర నిధులతో ఆటలు ఎలా..?

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: రెండేళ్ల పాటు క్రీడలను గాలికొదిలేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మూడో ఏట.. అమరావతి చాంపియన్‌ షిప్‌ పేరిట నిర్వహిస్తున్న ఒక అధికారిక క్రీడా పోటీలను నిర్వహించడానికి సన్నద్ధమైంది. కానీ కనీస నిధులు విదల్చకుండా చేతులెత్తేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం, శుక్రవారం (ఈనెల 6, 7 తేదీల్లో) జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకుగాను మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ క్రీడా కోర్టులను సిద్ధం చేస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎ.మహేష్‌బాబు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

2 రోజులు.. 12 క్రీడాంశాలు..

అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలు మూడు స్థాయిల్లో జరగనుండగా.. ఇప్పటికే నియోజకవర్గస్థాయి పోటీలు ముగిశాయి. జిల్లా పోటీల్లో విజేత లు లేదా ఎంపిక చేసిన జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

కబడ్డీ, ఖో–ఖో, వాలీబా ల్‌, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్‌, యోగా 12 క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు జరగనున్నాయి. అయితే ఈ పోటీల ని ర్వహనకు అవసరమైన నిధుల కేటాయింపు చేయకుండా నామమాత్రపు ఫండ్‌ కేటాయింపుతో అధికారులు ఆ శాఖాధికారులు తలలుపట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement