ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

Aug 2 2026 12:46 AM | Updated on Aug 2 2026 12:46 AM

కంచిలి: ఎల్‌నినో ప్రభావం వలన తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పాలడుగు వెంకట సత్యనారాయణ అన్నారు. మండలంలోని బూరగాం గ్రామంలో క్షేత్ర పరిశీలనకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగు చేయడం ఉత్తమం అన్నారు. దీనిపై కొందరు రైతులు వాటికి ఇచ్చే ఇన్సూరెన్స్‌ గూర్చి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.మురళీకృష్ణ, జిల్లా ఆత్మ పథక సంచాలకులు జగన్‌మోహన్‌, ఆముదాలవలస కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి, ఆమదాలవలస ఏ.ఆర్‌.ఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.చిట్టిబాబు, రాగోలు ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పి.ఉదయ్‌బాబు, సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు బి.నరసింహమూర్తి, మండల వ్యవసాయాధికారి కె.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement