శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దుకాణదారులు తూకాల్లో తేడాలు చేస్తే సహించేది లేదని తూనికలు, కొలతల శాఖ శ్రీకాకుళం ఇన్‌స్పెక్టర్ బాల రామకృష్ణ హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్, చేపలు, మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు మంగళవారం చేపట్టారు. 10 మంది వ్యాపారస్తులపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ముద్రలు లేకుండా కాటాలు ఉపయోగిస్తున్న వ్యాపారులపై 5 కేసులు నమోదు చేశామని తెలియజేశారు. ఎవరైనా వ్యాపారస్తులు తూకాల్లో అక్రమాలకు పాల్పడినా, ముద్రలు లేకుండా కాటాలు ఉపయోగించినా, ముద్రించిన ధరలు కంటే వస్తువులు అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో టెక్నికల్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు.


