డీఎస్సీలో నిజమైన అర్హులకు అన్యాయం జరిగింది. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మా ర్చారు. ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేకుండా 421 మందికి డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం. డీఎస్సీ పారదర్శకంగా ఉంటుందని నమ్మిన నిరుద్యోగులకు తీవ్ర ఆవేదన మిగిల్చారు. – ఎంవీ స్వరూప్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సీబీఐతో దర్యాప్తు చేయాలి
డీఎస్సీ పేపర్లు తయారు చేసిన వారికే స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం విచిత్రం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయాలి. అర్హులకు న్యాయం జరగాలి. – మార్పు పృథ్వీ,
పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వానిదే బాధ్యత
డీఎస్సీ మోసాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులను, యువతను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదు.
– ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు,
పార్టీ యువ నాయుడు
మోసగించడం అలవాటే
చంద్రబాబు ప్రభుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగులను మోసగించడం అలవాటైపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదు.
– ధర్మాన కృష్ణ చైతన్య, పోలాకి జెడ్పీటీసీ


