పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతంపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతంపై చర్యలు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతంపై చర్యలు

కవిటి : కవిటిలో రూ.కోట్ల విలువ కలిగిన సబ్‌పోస్టాఫీస్‌ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన సోంపేట సబ్‌డివిజనల్‌ పోస్టల్‌ ఇనస్పెక్టర్‌ కామేష్‌చంద్రపాత్రో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కవిటిలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆ స్థలంలో నిలుపుదల చేసిన వాహనాలను, వివిధ సామగ్రిని సంబంధిత వ్యక్తులకు చెప్పి తొలగించారు. ఈ స్థలం పోస్టాఫీసు శాఖకు సంబంధించినదని, ఇకపై ప్రైవేట్‌ వ్యక్తులు ఈ స్థలంలో వాహనాలు నిలుపుదల చేయడం వద్దని తెలిపారు. గేట్‌ తాళాలు వేయించి జిల్లా అధికారులకు సమాచారం తెలియపర్చనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement