శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్‌బాల్ క్రీడను దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి(గ్రామీణ ప్రాంతాల)కి తీసుకెళ్లాలని ఇండియన్ సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనోకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని క్రిస్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల ఏపీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ సెమినార్ కమ్ అంపైర్స్ క్లినిక్ కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి సాఫ్ట్‌బాల్ సంఘాల ప్రతినిధులు, అంపైర్లు, టెక్నికల్ అఫీషియల్స్, కోచ్‌లు సుమారు 120 మంది వరకు ఈ సెమినార్‌కు హాజరయ్యారు. ఏపీ సాఫ్ట్‌బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రవీణ్ అనోకర్ మాట్లాడుతూ ప్రస్తుతం సాఫ్ట్‌బాల్ క్రీడ అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడగా గుర్తింపు పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
సమావేశంలో సంఘ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


