అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఆడిట్ కోసం ఖర్చులను వసూళ్లు చేసిన ‘కలెక్షన్ రాజ్’పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కలెక్షన్ రాజ్’ కథనంపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం స్పందించారు. జాతీయ ఆరో గ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)విభాగంలో అధికారు లు, సిబ్బంది కదలికలు, వ్యవహారాలపై నిఘా ఉంచారు. ఆడిట్‌లో నకిలీ బిల్లులను సక్రమం చేసుకునేందుకు ఖర్చుల పేరిట వసూళ్లకు పాల్పడటంపై క్షేత్ర స్థాయిలో పీహెచ్‌సీల సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించారు. అలాగే ఆన్‌లైన్ ఎవిడెన్స్ కు దొరక్కుండా నేరుగా డబ్బులు తెప్పించుకున్న వ్యవహారంపై కూడా ఆరా తీశారు. సో మవారం పలువురు సిబ్బంది ఎన్‌హెచ్‌ఎం వి భాగంతో పాటు డీఎంహెచ్‌ఓ పరిపాలన వ్యవహారాల విభాగాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది.
డీడీఓ అఽధికార బదలాయింపులో కూడా ‘రాజ్’ ముద్ర
వైద్యశాఖలో జరిగే కార్యక్రమాల బిల్లులు బొక్కాలంటే ఓ అధికారి తన చేతిలో ఉండాలని ‘రాజ్’ తలిచాడు. అంతే అప్పటి డీఎంహెచ్‌ఓ సమక్షంలోనే ఎన్‌హెచ్‌ఎం కీలక విభాగాధికారి తనదైన శైలిలో డెమో అధికారికి డీడీఓ అధి కారం దక్కేలా పావులు కదిపి సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి వైద్య శాఖలో పనిచేస్తున్న స్టేట్ క్యాడర్ గెజిటెడ్ అఽధికారికి దక్కాల్సిన ఈ డీడీఓ అధికారం కాస్తా.. జోనల్ క్యాడర్ గెజిటెడ్ అధికారి అయిన డిప్యూటీ డెమో కె.ఎర్రన్నకు దక్కేలా చేశారు. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు సైతం దృష్టి పెట్టినట్లుగా సమాచారం. డీడీఓ అఽధికారాలున్న డిప్యూ టీ డెమో కె.ఎర్రన్నను ఈ అక్రమ వ్యవహారాల్లో దూర్చేసి బలిపశువు చేస్తున్నారనే కోణంలో వైద్యశాఖలో చర్చసాగుతోంది.


