శ్రీకాకుళం కల్చరల్: తమ్మినాయుడుపేటలోని చంద్రమౌళీశ్వరాలయంలో లలితా త్రిపురసుందరీ దేవిని ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు సురేష్ శర్మ, ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరించగా.. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు.
నీలమణికి అన్నాభిషేకం
సారవకోట: అవలింగిలోని నీలమణి అమ్మవారికి బుధవారం క్వింటా అన్నంతో అభిషేకం నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఆషాఢ ఉత్సవాలో భాగంగా అమ్మవారిని ముందుగా వివిధ రకాల కూరగాయలు, డ్రై ప్రూట్స్‌తో అలంకరించి ఉత్సవ విగ్రహానికి అన్నంతో అభిషేకించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.


