శ్రీకాకుళం క్రైమ్: భోగాపురం విమానాశ్రయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికిన ఓ ముఠా వందల మందికి టోకరా వేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే 70 మంది యువత వద్ద కొంతమేర వసూలు చేసినట్లు రెండో పట్టణ పోలీసులకు తెలియడంతో రంగప్రవేశం చేశారు. జీటీరోడ్డులోని డీసీసీబీ సమీప ఫంక్షన్ హాల్‌లో గురువారం ఈ మేరకు ఇంటర్వ్యూలు సైతం జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. రెండు నెల ల వ్యవధిలో నగరానికి చెందిన దాదాపు 300 మందిని జీటీరోడ్డులోని ఫంక్షన్ హాల్‌కు రప్పించారు. ఒక్కొక్కరికి అడ్మిషన్ ఫీజు రూ. 2 వేలు, ప్రాసెస్ ఫీజు రూ. 10 వేలు, 6 నెలల కోర్సు కింద రూ. 1.60 లక్షల చొప్పున మొత్తం 70 మంది నిరుద్యోగ యువత వద్ద వసూలు చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ద్వారకానగర్‌లో కార్యాలయం ఉందని, తీసుకున్న ఫీజులకు రశీదులు ఇస్తామని చెప్పి ఓ మహిళ ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆమె మాటలు రోజురోజుకీ అనుమానాన్ని పెంచడంతో కొంతమంది నిరుద్యోగులు రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ పి.ఈశ్వరరావు ఆ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిచి విచారించారు. బాధితుల నుంచి రాతపూర్వక ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తామని సీఐ పి.ఈశ్వరరావు పేర్కొన్నారు.
అరసవల్లి: జిల్లాలో సంచలనమైన పైడిభీమవరం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియో గం వ్యవహారంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. పైడిభీమవరంలో సుమారుగా రూ.7.50 కోట్ల వరకు పంచాయతీ నిధులు దు ర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచా యతీ కార్యదర్శి అజయ్ తీవ్ర అనారోగ్యం కా రణంగా రికార్డులను చూపించే పరిస్థితి లేదని ఉన్నతాఽధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏడుగురు అధికారులతో కూడిన బృందం పంచాయతీకి చెందిన అన్ని రికార్డులను స్వయంగా పరిశీలించి నిధుల వినియోగంపై నివేదిక ఇవ్వనున్నారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ విజయకుమారి, విశాఖ జిల్లా పరిష త్ సీఈఓ నారాయణమూర్తి, జాయింట్ డైరక్టర్ పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎన్.రామనాథరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ రఘురామిరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈ సత్యన్నారాయణ, డీడీ ఓ (పలాస) ఎం.సతీష్, డీఎల్‌పీఓ ఏఓ చక్రవర్తి, గ్రేడ్–1 పీడీఓ తిరుపతిరావు, జూనియర్ అసిస్టెంట్ పి.లోకేశ్వరరావు (టెక్కలి) లతో కూడిన బృందం ఏప్రిల్ 01, 2024 నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీలో జరిగిన పనులు, నిధుల మంజూరు, వినియోగాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు రికార్డులను వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు.
సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద నిషేధిత పదార్థాలైన గంజాయి, సారా, మద్యం అక్రమ రవాణ జరగకుండా నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుర్జీత్ సింగ్ సిబ్బందికి సూచించారు. పాతపట్నం ఆర్టిసీ కాంప్లెక్స్ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్‌పోస్టును, పాతపట్నం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. పాతపట్నం, వసుంధర చెక్‌పోస్టులో వాహనాల నంబర్లు పుస్తకం సక్రమంగా నమోదు చేయాలని, సిబ్బంది పనితీరు మెరుగుపడాలన్నారు. పాతపట్నం పరిధిలోని బి కేటగిరిలో ఉన్న బొన్ని, కోణంగి, పూతికగూడ, చాపరాయిగూడ గ్రామాల్లో నాటు సారా అమ్మకాలు పూర్తిస్థాయిలో నిరోధించామని తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గొడవ
టెక్కలి రూరల్: టెక్కలి నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం మహిళల మధ్య గొడవ జరిగింది. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కిన మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. దీంతో బస్సులో ఉన్న మిగిలిన ప్ర యాణికులకు ఆటంకం కలుగుతుండటంతో డ్రైవర్ బస్సును నేరుగా టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు బస్సులో గొడవ పడుతున్న సుమారు 20 మంది మహిళలను బస్సు నుంచి కిందకు దింపి ఆ బస్సును పంపించేశారు. అనంతరం ఆ మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.


