విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందే | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందే

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చలేదు. 2025 ఏప్రిల్‌ 19న ప్రకటించిన మెగా డీఎస్సీ నిరుద్యోగులకు చీకటి దినం. శాప్‌ సర్టిఫికెట్‌తో 421 పోస్టులను స్పోర్ట్స్‌ కోటాలో కట్టబెట్టారు. కష్టపడి మెరిట్‌ సాధించిన వారికి అన్యాయం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెప్పాల్సిందే. – మెంటాడ స్వరూప్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షుడు

మెగా డీఎస్సీ పేరుతో దగా

ప్రస్తుత ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో అర్హత కలిగి, మెరిట్‌ ఉన్న నిరుద్యోగ యువతను దగా చేసింది. డిగ్రీ పూర్తి చేసి, బీఈడీ చేసి టెట్‌ క్వాలిఫై అయ్యి డీఎస్సీ రాసి మంచి ర్యాంకులు సాధించినవారిని పక్కన పెట్టి రూ. 15 లక్షలకు, రూ. 20 లక్షలకు ఏమీ రాని వారిని స్పోర్ట్స్‌ కోటాలో ఓ సర్టిఫికెట్‌ ఆధారంగా పీఈటీ వంటి పోస్టు కాకుండా ఫిజిక్స్‌, మ్యాఽథ్స్‌ వంటి కీలక పోస్టులను కట్టబెట్టారు. ఇది చాలా అన్యాయం. – కొమ్ము శ్రీనివాస్‌,

ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

అర్హత కలిగిన వారికి అన్యాయం

రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో తీరని అన్యాయం చేశారు. గోల్డ్‌ మెడలిస్టుల ను పక్కనబెట్టి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో పోస్టులు కట్టబెట్టారు. ప్రశ్న పత్రాల నిర్వహణలో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి టాప్‌ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. – మార్పు పృథ్వీ, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు

డీఎస్సీలో అక్రమాలు జరిగాయి

కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. ఎంతో మంది అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. ఎన్నిక ల మునుపు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. – టి.సూర్యం,

నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement