ముగిసిన అప్పలరాజు పోలీసు కస్టడీ విచారణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అప్పలరాజు పోలీసు కస్టడీ విచారణ

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

వజ్రపుకొత్తూరు రూరల్‌, శ్రీకాకుళం క్రైమ్‌: మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కస్టడీ విచారణ ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనంగా సాగింద ని రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. మంగళవారం ఒక్క రోజు కస్టడీ విచారణ కోసం సీదిరిని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సోంపేట సీఐ మంగరాజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించా రు. అనంతరం పోలీసుల బలగాల నడుమ ఆరోగ్య వైద్య పరీక్షలకు పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పలాస జూనియర్‌ సివి ల్‌ కోర్టుకు హాజరు పరిచి మళ్లీ అంపోలు జైలుకు తరలించారు. అయితే కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు వెళ్తున్న న్యాయవాదులను అలాగే మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు న్యాయవాదులను కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే మీడియా ప్రతినిధులను మాత్రం అన్ని చోట్లా అడ్డుకున్నారు.

ఉదయం నుంచే కాశీబుగ్గలో పోలీసు బలగా లు మోహరించాయి. కేసును వాదిస్తున్న బాలకృష్ణ మాట్లాడుతూ కోర్టు తీర్పు రాకుండా అడ్డుకునేందుకే పోలీసులు కస్టడీ పిటీషన్‌ వేశారని, సీదిరి పోలీసులకు సహకరించారని తెలిపారు. బుధవారంతో రిమాండ్‌ ముగుస్తుందని, తర్వాత పరిణామాలు చూడాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement