మందస: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు క్షేమంగా ఉండాలని, త్వరితగతిన విడుదల కావాల ని కోరుతూ మండలంలోని గంగువాడ గ్రామ సముద్ర తీరంలో గంగమ్మ తల్లికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పొట్టి ధర్మారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు గంగమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఆయనపై పెట్టిన అక్ర మ కేసులో న్యాయం జరిగి మళ్లీ ప్రజాసేవలో పా ల్గొనే అవకాశం కలగాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కొమర దేవరాజు, అంబటి ఆనంద్, పార్టీ నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కొమర వాసు, గుంటు లోకనాథం, పొట్టి యర్రయ్య, లైసె ట్టి నారాయణ, నల్ల పరుశురాం, దున్న హరికృష్ణ, తెప్పల గున్నయ్య, జుత్తు నారాయణ, జుత్తు భూపతి, మర్ల సంతోష్, గొలుసు చంద్రశేఖర్, పూలరి పీతాంబరం, బత్తిని తేజేశ్వరరావు, తాడల అప్పలస్వామి, కీలు మోహన్‌రావు, గుంటు కపిల్, సంగారు కృష్ణారావు, పల్లేటి రూపారావు పాల్గొన్నారు.


