శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన వినియోగారులు తప్ప నిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని భారత ప్రభు త్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈకేవైసీ ఈనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత గ్యాస్ సంస్థలకు ఆదేశించింది. సకాలంలో ఈకేవైసీ ధ్రువీకరణ పూర్తిచేయకపోతే ఎల్‌పీజీ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయచ్చునని పేర్కొన్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: వాతావరణ ప్రతి అనుకూ ల పరిస్థితుల ప్రభావంతో ఈఏడాది పంట పూర్తిగా నష్టం వాటిళ్లడంతో శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ వద్ద ఉన్న లిబరేషన్ కార్యాలయంలో బుధవారం సీఐటీయూ నాయకు డు ఎన్.గణపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న జరగనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పి లుపునిచ్చారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, బలవంతపు భూసేకరణ అపాలని కోరా రు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.మోహన్‌రావు, లిబరేషన్ నాయకులు టి.సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ నాయకులు జుత్తు వీరస్వామి, పౌర హక్కుల సంఘ నాయకుడు పి.దానేసు, రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు జి.బాలకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు మద్దిలి రామారావు, ఎస్.లక్ష్మీ నారాయణ, ఎం.వినోద్ కుమార్, టి.అజయ్ కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.


