మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌పై కేసు నమోదు

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

● జేఆర్‌పురం స్టేషన్‌లో 23మంది కేసు

● ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో 11మందిపై కేసులు నమోదు

రణస్థలం: ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌తో సహా 23 మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. గత నెల 30వ తేదిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో రణస్థలం మండల కేంద్రంలో, ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం జంక్షన్ల వద్ద భారీగా జన సమీకరణ చేశారని, ర్యాలీలు నిర్వహించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో ఈ నెల 2వ తేదీ ఆదివారం అర్ధరాత్రి కేసులు నమోదు చేసినట్లు జేఆర్‌ పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. అలాగే ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో 11మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేశామని జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement