ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షునిగా కిల్లారి | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షునిగా కిల్లారి

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

అరసవల్లి: ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల జిల్లా సంఘ అధ్యక్షునిగా మరోసారి కిల్లారి నారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కింజరాపు నర్సింహమూర్తితో పాటు 18 మంది సభ్యుల ఎన్నికంతా ఏకగ్రీవమైంది. ఈమేరకు ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి సీహెచ్‌ మురళి పరిశీలనలో, గౌరవాధ్యక్షులు బీవీఆర్‌ ప్ర సాద్‌ (రాంబాబు)ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్ని కల ప్రక్రియ అంతా ఏకగ్రీవం కావడం విశేషం. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా పి.నాగేశ్వరరావు, కోశాధికారిగా ఎ.ధర్మారావు, స్టేట్‌ కౌన్సెలర్లుగా కేఎంకే పట్నాయక్‌, కె.రామారావు, సిహెచ్‌టీ నాయుడు, వై.రాజేష్‌లు ఎన్నికవ్వగా, ఉపాధ్యక్షులుగా ఇ. రఘు, ఎ.అనూరాధ, డి.కిషోర్‌, జాయింట్‌ సెక్రట రీలుగా పి.జయమ్మ, బి.రుష్యేశ్వరరావు, బి.భాగ్యలక్ష్మి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా కె.శ్రీనివాసరెడ్డి, బిఆర్‌జి.అరుణ్‌, పి.మన్మధరావు, జేసీసీ మెంబర్‌గా ఎస్‌.అభిషేక్‌ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా సంఘానికి మరోసారి అధ్యక్షునిగా కిల్లారి నారాయణరావుతో పాటు కార్యవర్గ సభ్యులంతా ఎన్నికల అధికారి మురళి ఆధ్వర్యంలో ఎన్నికల నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement