వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

నరసన్నపేట: స్థానిక మెయిన్‌ రోడ్డులో పాత బస్టాండ్‌ వద్ద అన్న క్యాంటీన్‌ ఎదురుగా డివైడర్‌కు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో స్థానిక హ డ్కో కాలనీకి చెందిన గుడ్ల శ్రీనివాసరావు(55) మృతి చెందారు. గురువారం రాత్రి ప్రమాదం జరగ్గా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 వాహనంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై శ్రీనివాసరావు బార్య గుడ్ల శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. శ్రీనివాసరావు మృతిపై వైఎస్సార్‌ సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పొట్నూరు సాయి ప్రసాద్‌, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దండి జయప్రకాశ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

కంబకాయ వాసి..

నరసన్నపేట: కంబకాయకు చెందిన లింగిబైరి వైకుంఠరావు(19) రోడ్డు ప్రమాదంలో గాయ పడి చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో శుక్రవారం మృతి చెందాడు. కాకినాడ పీఆర్‌ కళాశాలలో బీఎస్సీ మూ డో సంవత్సరం చదువుతున్న వైకుంఠరావు తన స్నేహితులతో కలసి బొలేరే వాహనంలో ఒక ఫంక్షన్‌కు జూలై 29న బయల్దేరారు. ప్రయాణంలో వా హనం బోల్తా పడి తలకు బలమైన గాయం కా వడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, హేమలత కన్నీరు మున్నీరయ్యారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

శ్రీకాకుళం రూరల్‌: సింగుపురం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి వద్ద శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని పచ్చళ్ల వ్యాపారి చిన్నారి సత్యనారాయణ (74) మృతి చెందారు. పిఠాపురానికి చెందిన సత్యనారాయణ శ్రీకాకుళం నగరంలో పచ్చళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నా రు. తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. రూరల్‌ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement