● కూటమి నాయకులపై మత్స్యకార నాయకుల ధ్వజం
వజ్రపుకొత్తూరు రూరల్: మత్స్యకారులు, మత్య్సకార నాయకులను అణచివేసేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపడం ఖాయమని మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న కక్షపూరిత రాజకీయ చర్యల్లో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు ఆధ్వర్యంలో అప్పలరాజును విడుదల చేయాలని కోరుతూ సోమవారం వజ్రపుకొత్తూరు మండలంలోని గుణుపల్లి తీరంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార కులాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయల్లోకి వచ్చిన సీదిరి అప్పలరాజు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. మత్స్యకారులను అణగదొక్కితే ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల్లా న్యాయ పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఎన్నికల హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ వంక రాజు, ఎంపీటీసీ తిర్రి గుణ, తాజా, మాజీ సర్పంచ్ తిర్రి కామేశ్వరి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఇరోతు హేమంత్, మండల ఉపాధ్యక్షుడు దున్న బాలరాజు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు కొమర దేవరాజు, అంబటి అనంద్, గూడ ఈశ్వరరావు, వడ్డి కరుణాకర్, బత్తిని లక్ష్మీనారాయణ, చింత హేమరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కర్ని శ్రీను, చౌదాల వెంకన్న, తిర్రి లక్ష్మీనారాయణ, సూరాడ మాధవరావు, కోడ నిరంజన్, డొంక విద్యాసాగర్, గొరకల విశ్వనాథం, జోగి అప్పారావు, అర్లి దానేష్, లక్ష్మణ్, సైన కేశవ, దాసరి తిరుపతి, దువ్వాడ ఉమామహేశ్వరరావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు జోగి అనంద్ తదితరులు పాల్గొన్నారు.


