breaking news
traffic halted
-
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఒడిశాలో భారీ వర్షాలతో మహేంద్ర తనయ నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి. పాతపట్నం-పర్లాకిమిడి NH-326A రహదారిని అధికారులు మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా రహదారిపై రాకపోకలను ఏపీ-ఒడిశా అధికారులు నిలిపేశారు. వరద ఉధృతి నేపథ్యంలో ఇరు రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తమయ్యారు.కాగా, బాహుదానది ఉగ్రరూపం దాల్చడంతో ఇచ్ఛాపురం మండలంలోని నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు అర్ధరాత్రి తుఫాన్ ప్రభావం.. మరోవైపు ఒడిశా ప్రభుత్వం భగలట్టీ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.నుంచి బాహుదానది, పద్మనాభపురం(దండు) గెడ్డలు ఉప్పొంగడంతో ఇన్నేశుపేట, డొంకూరు, లక్ష్మీపురం, జగన్నాథపురం, శాసనాం, బిర్లంగి, బి.తోటూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, లొద్దపుట్టి, తేలుకుంచి, రత్తకన్న, మశాఖపురం, బొడ్డబడ గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావడంతో ఇళ్లు మునిగిపోయాయి.స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారి పూర్తిగా జలమయం కావడంతో కోల్కతా నుంచి చెన్నై రాకపోకలు సాగించే లారీలు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. నీటిలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.ఇదీ చదవండి: అండమాన్లో మరో అల్పపీడనం -
ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!
ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే మధ్యలో ట్రాఫిక్ అంతా ఆపేసి మరీ వారిని ఆగమేఘాల మీద పంపిస్తారు. అదే సామాన్యుడు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుందటే మాత్రం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా గంటల తరబడి సమయం పడుతుంది. కానీ.. చెన్నైలో మాత్రం అందుకు విభిన్నంగా జరిగింది. ఓ సామాన్య రోగి ప్రాణాలు కాపాడాలని రెండు ఆస్పత్రుల వైద్యులు, పోలీసులు కలిసి చేసిన 'ఆపరేషన్' నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. ట్రాఫిక్ అవరోధాలన్నింటినీ దాటుకుని సరిగ్గా పావుగంటలోనే గుండెను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించి.. దాన్ని రోగికి అమర్చి ప్రాణాలు కాపాడారు. అచ్చం 'ట్రాఫిక్' సినిమాలో చూపించినట్లుగా సాగిన ఈ ఆపరేషన్.. నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. సాధారణంగా అయితే మనిషి గుండెను బయటకు తీసిన తర్వాత అది సురక్షిత పరిస్థితుల్లో కూడా 4గంటలే ఉపయోగపడుతుంది. ఉదయం 5.45 గంటల సమయంలో ఓ రోగి దాదాపుగా బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉన్నాడని, అతడి గుండెను తీసుకోవచ్చని ప్రభుత్వాస్పత్రి నుంచి చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. అప్పటికే అక్కడ ఓ రోగి ఎన్నాళ్లుగానో గుండెమార్పిడి కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పోలీసులకు కూడా విషయం చెప్పారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో ప్రధానమైన 12 ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎక్కడా రెడ్లైట్ అనేది వెలగకుండా ఉండేలా ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద 6.44 గంటలకు అంబులెన్సు బయల్దేరింది. దాని ముందుగా పోలీసు పైలట్ వాహనం కూడా వెళ్లింది. సిగ్నల్ పాయింట్లు దాటే సమయంలో కూడా ఆ వాహనాల వేగం దాదాపుగా గంటకు 100 కిలోమీటర్లు!! సాధారణంగా కనీసం 45 నిమిషాలు పట్టే ఆ దూరం దాటడానికి అంబులెన్సుకు పట్టిన సమయం.. కేవలం 13 నిమిషాలు. 6.57 గంటలకల్లా ఫోర్టిస్ ఆస్పత్రికి 'గుండె' భద్రంగా చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు చకచకా శస్త్రచికిత్స చేసి, గుండెను మార్చేశారు.


