పచ్చ గూండాల అరాచకం.. సాక్షి విలేఖరిపై దాడి | TDP Supporters Attack Sakshi Reporter At His Residence In Nandyal, Journalist Alleges Political Harassment And Threats | Sakshi
Sakshi News home page

పచ్చ గూండాల అరాచకం.. సాక్షి విలేఖరిపై దాడి

Oct 30 2026 8:49 AM | Updated on Oct 30 2026 9:17 AM

TDP Leaders Attack On Sakshi Reporter At Nandyal

సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ గూండాల దాడులు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. మీడియా ప్రతినిధులను సైతం పచ్చ ముఠా టార్గెట్‌ చేసింది. తాజాగా నంద్యాలలోని ఆత్మకూరు మండలం నల్లకాల్వలో పచ్చమూకలు అరాచకం సృష్టించాయి. సాక్షి విలేఖరి ఇంటిపై టీడీపీ మూకలు దాడులు చేశాయి.

వివరాల మేరకు.. ఆత్మకూరు సాక్షి దినపత్రిక విలేఖరి ఎన్‌వీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ గుండాలు తాజాగా దాడికి పాల్పడ్డారు. సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడులు చేశారు. కాగా, నిన్న పోలీసుల ముందే సుబ్బారెడ్డిని టీడీపీ నాయకులు బెదిరించడం గమనార్హం. అయితే, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా బుడ్డా రాజశేఖర రెడ్డిదే బాధ్యత అని సుబ్బారెడ్డి తెలిపారు. 

ఇదీ చదవండి: యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. పింఛన్ల ముసుగులో ఓటర్లకు తాయిలాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement