ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP: Local Election Candidates Nomination Papers And Affidavits In Online | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Oct 30 2026 1:24 PM | Updated on Oct 30 2026 1:30 PM

AP: Local Election Candidates Nomination Papers And Affidavits In Online

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదించింది. ఈమేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

ఎస్‌ఈసీ.. హైకోర్టుకు నివేదించిన  అఫిడవిట్‌లో అంశాలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని.. పోర్టల్ ద్వారా మున్సిపల్, గ్రామీణ స్థానిక సంస్థల అభ్యర్థుల వివరాలు వీక్షించే అవకాశం ఉందని ఎస్‌ఈసీ పేర్కొంది. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు,వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పామన్న ఎస్‌ఈసీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, సెల్ఫ్ అఫిడవిట్లు కూడా వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించాం. పోలింగ్ తేదీకి ముందుగానే అభ్యర్థుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పామని తెలిపింది.

భారీ స్థాయిలో ఉండే డేటా దృష్ట్యా పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, మున్సిపల్ శాఖల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. సంబంధిత శాఖల వెబ్‌సైట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి లింకులు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించామని ఎస్‌ఈసీ తెలిపింది.. ఈ మేరకు పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, మున్సిపల్ శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.

ఇదీ చదవండి: కూటమి ఓటమికి రె‘బెల్స్‌’

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement