శ్రీ సత్యసాయి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్‌లో బాలకృష్ణ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం(అక్టోబర్ 30వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసినా, సాయంత్రం 5.16 గంటల వరకూ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్సార్‌సీపీ నేతలు.

ప్రజాస్వామ్యంపై పచ్చముద్రకు భారీ కుట్రలు?
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో విధ్వంసం సృష్టించిన టీడీపీ.. ఎన్నికల రోజున భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలంటూ అటు టీడీపీ పెద్దలు, ఇటు పోలీసుల బెదిరింపులను చూస్తే అరాచకం సృష్టించి గెలవడానికి టీడీపీ పన్నాగం చేస్తోంది.
ఈ క్రమంలోనే సామాన్యులు ఓట్లు వేయకుండా అడ్డుకునే ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగానే పోలింగ్ రోజుల కావాలనే పోలీసుల సంఖ్యను కుదించారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తును టీడీపీ గూండాలను తరలిస్తుంది. మరొకవైపు పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ నేతలు బయటకు రాకుండా ఉండేలా టీడీపీ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ప్రధానంగా పులివెందులలో పోలింగ్ రోజున భారీ విధ్వంసానికి కుట్రలకు టీడీపీ తెరలేపే అవకాశాలు కనబడుతున్నాయి. దొంగ ఓట్లు, ఓట్ల రీసైక్లింగ్ రిగ్గింగ్ చేసేందుకు పన్నాగాలు రచించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత


