సాక్షి,వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ నేతల కార్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాయి.
ఈ దాడులకు నిరసనగా జమ్మలమడుగులోని పాతబస్టాండ్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నిరసన ధర్నాలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, చైర్‌పర్సన్ అభ్యర్ధి హైమావతి తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని ప్రభుత్వ తీరుపై, దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


