సాక్షి,తాడేపల్లి: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వీసీ,ఎండీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘకాలం పోలీసుశాఖలో సేవలందించడంతో పాటు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన బాలసుబ్రహ్మణ్యం మరణం విచారకరమని వైఎస్ జగన్ తెలిపారు.
బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


