భక్తులకు అలర్ట్.. శబరిమల మకరజ్యోతి సీజన్‌ వర్చువల్ క్యూ స్లాట్లు ఓపెన్! | Sabarimala Makaravilakku: January Virtual Queue Slots Now Open | Sakshi
Sakshi News home page

భక్తులకు అలర్ట్.. శబరిమల మకరజ్యోతి సీజన్‌ వర్చువల్ క్యూ స్లాట్లు ఓపెన్!

Oct 30 2026 6:34 PM | Updated on Oct 30 2026 6:45 PM

Sabarimala Makaravilakku: January Virtual Queue Slots Now Open

తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రధాన పండుగ మకరజ్యోతి (మకరవిళక్కు) దర్శనానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. మకరజ్యోతి సీజన్‌కు సంబంధించి జనవరి నెల వర్చువల్ క్యూ స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి.

శబరిమలను దర్శించు కోవాలనుకునే భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందుగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో (సంక్రాంతి పండుగ రోజున జనవరి 14,15 తేదీల్లో) ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సీజన్‌లోని అత్యంత ముఖ్యమైన ఘట్టం మకరజ్యోతి దర్శనం. సంక్రాంతి రోజున శబరిమలకు సమీపంలోని పొన్నంబలమేడు కొండపై దివ్యమైన జ్యోతి రూపం దర్శనమిస్తుంది. దీనిని స్వామివారి దివ్య రూపంగా భావించి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకిస్తారు.

అయ్యప్ప స్వామి ధరించే పవిత్ర ఆభరణాలను పందళం రాజభవనం నుంచి ప్రత్యేక ఊరేగింపుగా శబరిమలకు తీసుకొస్తారు. మకరవిళక్కు రోజున స్వామివారికి ఈ ఆభరణాలను అలంకరించి మహాదీపారాధన నిర్వహిస్తారు. నవంబర్ నెలలో ప్రారంభమయ్యే మండల పూజ సీజన్ ముగిసిన తర్వాత, కొద్ది రోజులు ఆలయాన్ని మూసివేసి తిరిగి మకరవిళక్కు కోసం తెరుస్తారు. ఈ మకరవిళక్కుతో శబరిమల వార్షిక తీర్థయాత్ర సీజన్ ఘనంగా ముగుస్తుంది.

ఈ పవిత్ర ఘట్టాన్ని కళ్లారా వీక్షించి, అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు అయ్యేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement