ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక స్థానం | Congress Party wins Nagpur MLC election | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక స్థానం

Oct 30 2026 4:26 AM | Updated on Oct 30 2026 4:26 AM

Congress Party wins Nagpur MLC election

నాగపూర్‌ గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గంలో విజయం  

నాగపూర్‌: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎట్టకేలకు ఒక స్థానం దక్కింది. మహారాష్ట్రలోని నాగపూర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజీత్‌ వంజరి బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ కోహలేపై 3,271 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మంగళవారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు గురువారం ముగిసింది. వంజరికి 67,231 ఓట్లు, సుధాకర్‌ కోహలేకు 63,960 ఓట్లు లభించాయి. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీల సొంత పట్టణమైన నాగపూర్‌లో బీజేపీ ఓటమి పాలవ్వడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. వీరిద్దరూ తమ అభ్యర్థి సుధాకర్‌ కోహలే తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ సానుకూల ఫలితం రాలేదు. మహారాష్ట్రలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ మూడు స్థానాలు, అధికార మహాయుతి రెండు స్థానాలు గెలుచుకున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానం కూడా దక్కించుకోని సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఒక స్థానం నెగ్గడం ఆ పారీ్టకి కొంత ఊరటనిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement