కాంగ్రెస్‌ గెలిచింది ఎన్ని?  | PM Narendra Modi mocks Congress for failing to win MLC elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలిచింది ఎన్ని? 

Oct 29 2026 5:41 AM | Updated on Oct 29 2026 6:27 AM

PM Narendra Modi mocks Congress for failing to win MLC elections

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దుస్థితిపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు 

న్యూఢిల్లీ:  నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించాలని నెటిజన్లను కోరారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఈ ప్రశ్నకు మోనోకిల్‌తో ఆలోచిస్తున్న ముఖం ఉన్న ఎమోజీని జతచేశారు. 

మోనోకిల్‌ ద్వారా చూస్తున్న ముఖాన్ని సూచించే ఈ ఎమోజీని సాధారణంగా ఉత్సుకతను లేదా సందేహాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్లతోనే జరిగాయని మోదీ గుర్తుచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం బ్యాలెట్‌ పేపర్లతోనే నిర్వహించాలని కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్ల బీజేపీ లాభపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బ్యాలెట్‌ పేపర్లతోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిందని మోదీ పరోక్షంగా ఎద్దేవా చేశారు.  

బటన్‌ అయినా, బ్యాలెట్‌ అయినా ఫలితం ఒక్కటే 
ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలే కావాలని కోరుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కర్ణాటక ఎమ్మెల్సీ ఫలితాల గురించి ప్రస్తావించారు. ‘‘కర్ణాటకలో ఏం జరిగిందో చూడండి. బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. బీజేపీ నాలుగు సీట్లనూ గెలుచుకుంది’’అని వెల్లడించారు. ‘‘బ్యాలెట్‌ పేపర్‌ అయినా, ఈవీ ఎం అయినా ప్రజల ఎంపిక స్పష్టంగా ఉంది’’అంటూ బీజేపీ ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది. ‘‘బటన్‌ అయినా, బ్యాలెట్‌ అయినా ఫలితం ఒక్కటే’’అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ పోస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement