సైబర్‌ నేరగాళ్లను వదిలిపెట్టొద్దు: సుప్రీం | Digital arrest scamsters must be dealt with ruthlessly says Supreme Court | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లను వదిలిపెట్టొద్దు: సుప్రీం

Oct 29 2026 5:30 AM | Updated on Oct 29 2026 5:30 AM

Digital arrest scamsters must be dealt with ruthlessly says Supreme Court

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్‌ అరెస్టుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. అమాయకులను, వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ వ్యవస్థీకృత సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలని తేల్చిచెప్పింది. వీటిని కేవలం బెదిరింపు(ఎక్స్‌టార్షన్‌) నేరాలుగా పరిగణించలేమని, ఇవి ముమ్మాటికీ డిజిటల్‌ దోపిడీలేనని స్పష్టంచేసింది. డిజిటల్‌ అరెస్టులకు పాల్పడే సైబర్‌ నేరగాళ్ల పట్ల ఎలాంటి కనికరం లేకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.  

డిజిటల్‌ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్‌ నేరాలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ గౌరబ్‌ కుమార్‌ సాహా తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సైబర్‌ ముఠాల తీరుపై జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాల్స్‌ ద్వారా డిజిటల్‌ అరెస్టుల పేరుతో సాగిస్తున్న అకృత్యాలు డిజిటల్‌ దోపిడీ కిందకే వస్తాయి. ఇలాంటి ముఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement