S.I.R ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Supreme Court Issues Key Directives on SIR Process, Says No Deadline for Forms 6 and 8 | Sakshi
Sakshi News home page

S.I.R ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Oct 28 2026 5:22 PM | Updated on Oct 28 2026 5:30 PM

Supreme Court Issues Key Directives on SIR Process, Says No Deadline for Forms 6 and 8

సాక్షి,న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫామ్‌ 6, 8 దరఖాస్తులకు ఎలాంటి గడువు పెట్టొద్దని స్పష్టం చేసింది. వలస కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ సందర్భంగా ‘ఫామ్‌ నింపలేదనే కారణంతో ఓట్ల తొలగింపు సరికాదు. అర్హులకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఇప్పటికే ఓటు ఉన్నవారు ఫామ్‌-6 ఎందుకు నింపాలి. చిరునామా మార్చుకోవాల్సిన ఓటర్లకు ఫామ్‌-8తో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని’ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement