సమాధానానికి పది రోజుల గడువు  | Supreme Court grants petitioners 10 days to counter ECI defence of SIR | Sakshi
Sakshi News home page

సమాధానానికి పది రోజుల గడువు 

Oct 28 2026 6:08 AM | Updated on Oct 28 2026 6:08 AM

Supreme Court grants petitioners 10 days to counter ECI defence of SIR

ఈసీ అఫిడవిట్‌పై సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై పదిరోజుల్లో సమాధానాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం పిటిషనర్లను ఆదేశించింది. సర్‌పై జారీ చేసిన మూడు ఆదేశాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేని చెబుతూ దాఖలైన ఈ అఫిడవిట్‌లో మిగిలిన అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంది. 

బిహార్‌లో సుప్రీంకోర్టు అనుమతి లేకుండానే ఫారం–6లో మార్పులు చేసిన విషయంపై రాజ్యసభ సభ్యురాలు డోలా సేన్‌ దాఖలు చేసిన తాజా పిటిషన్‌పైనా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీతోపాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. డోలా సేన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, ఎంపీ మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. 

ఫారం–6లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఈసీ తప్పుగా పేర్కొందని ఆరోపించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌కు పది రోజుల్లో ప్రత్యుత్తరం సమరి్పంచాలని తొలి పిటిషనర్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌కు సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement